హిందూ సమాజం ఎందుకని హిందుఫోబియా ను ఎదుర్కోడంలో విఫలం అయింది?

భారతదేశ విచ్చిన్నత

శలభ్ ఉపాధ్యాయ్ : చిత్రంగా,మరి హిందుఫోబియా (అంటే…….. హిందువులంటే భయం లేదా ఆందోలన) ఏదైతే ఉందో, దాని గురించి ……

గత ఫిబ్రవరిలో మాడిసన్, అలబామా రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది.

సురేష్ భాయ్ అనే ఒక వృద్ధుడికి ఒక పోలీసు అధికారితో జరిగిన గోడవ విషయం.

ఆయనను నేల మీదకు బలంగా తోసినందుకుగాను ఆయన పక్షికంగా పక్షవాతానికి లోనైయ్యారు. కోర్టులో దీనికి సంబంధించి కేసు వేయడం జరిగింది.కోర్టు ఆ పోలీసు అధికారిని ఈ జనవరిలో నిర్దోషి గా ఘోషించింది.

ఆ సమయంలో ఇక్కడ అమెరికాలో ఉన్న భారతీయులకు ఇది, అదేదో కేవలం ఒక సామాన్యంగా జరిగే ఘట్టంగా కాడుండా ఒక విధంగా చూస్తే, ఆయన తెల్ల జాతీయుడు కానందున, వర్ణవివక్ష వల్ల టార్గెట్ చేసి నిర్దేశించినట్టుగా అనిపించింది.అదే సమయంలో పశ్చిమవాషింగ్టన్ రాష్ట్రంలోఅనేక హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. అయితే, వీటిని ద్వేషపూరిత నేరాలుగా కాక ఆకతాయుల పని అని చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నప్పుడు కూడా మరి ఎందుకని ఈ హిందూఫోబియా అనే విషయం పై చర్చ జరగలేదంటారు?

రాజీవ్ మల్హొత్రా: ఇది చాలా మంచి ప్రశ్న. నా ఉద్దేశంలో పొరపాటు మనదే. నేను చాలా కాలంగా పాశ్చాత్యులను, వారి ఆలోచనా విధానాలను వారి సమస్యలను పరిశీలించి, విశ్లేషించి వారిని కొన్నిరకాలుగా విభజించాను. అలాగే హిందువులను కూడా విభజించాను. దానిని ఇంకా ప్రచురించలేదు. ఎందుకంటే, అది చూసాక ఇంక వాళ్ళు నా పుస్తకాలు చదవడం మానేస్తారేమానని. అందుకని వాటిని చివర వరకూ అలాగే ఉంచాలనుకుంటున్నాను. మన అధికారుల గురించి, నేతల గురించి, మనబానిసత్వపు మనస్తత్వం గురించీ, చాలా చాలా కఠినమైన విషయాలు చెప్పాలని ఉంది. అసలు ఎప్పుడు మొదలైందీ ధోరణి? మొఘల్ల కాలంలోనా? బ్రిటీషువారి కాలంలో నా?ఎప్పుడు, ఎలా పోగొట్టుకున్నాం,…మనదైన ఆ క్షత్రీ యత్వం? ఆ నాయకత్వం?

మరి ఇప్పుడో……. అంటి ముట్టనట్టు ఉండి,మన పనేదో మనం చేసుకుపోదాం అన్నట్టు తష్పించుకు తిరుగడం …

ఇక్కడికి వలస వచ్చింది నాలుగు రాళ్ళు సంపాధించడానికే అని…. ఇల్లు , బాగా డబ్బు,ధనం పోగేసుకున్నాం. ఇంక అదే చాలు. ఆ స్థితిని కుదిపేది ఏదైనా దాని జోలికి వెళ్ళం. మరిదాని తరువాతో….పిల్లలు. వాళ్ళుస్థిరపడాలి.వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ పేరు ప్రతిష్టలు….

ఇంకా ఎక్కడో చోట ఓ 20 మిలియన్ల డాలర్ల గ్రాంట్లు ఇచ్చి, ఏ బిల్డింగు పైనో తమ పేరు రాయించుకుంటే సరి ……ఇంకా తెల్లవారికి సమానంగా, ఓ దొరలాగా చలామణీ అయిపోవచ్చు కూడా.‘ఇది జీవితంలో నెగ్గడంఅంటే.’అనే ధోరణి. ఇక,భారతదేశంలో చాలా పేరుగల రాజకీయ సంఘాలు, హిందూధర్మానికి ప్రతినిధులుగా ఉన్నప్పటికీ కూడా ఇలా విశ్లేషణా పరిశోధనా ఏమీ చేయలేదు. అట్టహాసంగా ప్రసంగాలు చేయడం, ప్రేరేషించడం, బడాయిలు పోవడం. అంతే గాని ఓ ప్రణాళికా బద్ధంగా సంస్థాపరంగా దీర్ఘకాలికంగా పరిశోధించడం లేదు.నేను చేసినట్టుగా లోతుగా పరిశీలించే దిశలో ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. పరిశోధనలో పెట్టుబడి చేయలేదు.నాతో పాటు కలిసి ఈ దిశలో పనిచేస్తారని నాకు సహకారాన్ని ఇస్తారని చాలా ఆశించాను.

నేను నా ఉద్యోగం, నా కరియర్ ను వదిలేసాను. ఆర్థికపరంగా కూడా అన్ని వదిలేసి ఈ పని పూనుకున్నాను. నాతో చేయికలిపి పనిచేయడానికి జనం వస్తారని చాలా ఆశించాను. అబ్బ! చాలా మంచి పని చేస్తున్నారండీ! మేము ఏదో ఓ రోజున మీతో కలిసి పనిచేస్తాము, మీకు సహాయం చేస్తాము.. అని ప్రశంసలు చేయడమే కానీ ఆ ఒక్కరోజు ఎప్పుడూ రాదే!.

మన సంఘంలో మనవాళ్ళలో కావలసినది తపస్య.త్యాగం.అది లేదు. ఇక మతాధికారులకివస్తే…….

మన మతాధికారులు, గురువులు, స్వాములు, ఆచార్యులు. ఆలోచించి చూస్తే ఇది వారు చేయవలసిన పనిగా అనిపిస్తుంది.

చాలామంది భారతదేశంలో చాటు గా సపోర్టు చేసేవారు; ప్రైవేటు గానే సహకారం ఇచ్చేవారు…..మరి ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇంకొంత మంది నాకు బహిరంగంగా కూడా మద్దత్తున్నివ్వడానికి ముందుకొస్తున్నారు.

ఈ దేశంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.కొంత మందికి భయం కూడా.ఎందుకో మరి! నాకు అర్థం కాదు.ఇక్కడ ధర్మాన్ని సంరక్షించు కోడానికి, మతానికి సంబంధించిన చట్టాలు చాలా దృధంగా ఖచ్చితంగా ఉంటాయి.

ఇక్కడ చిత్రవేంటంటే ఐర్లండు దేశం నుండి ప్రవాసం వచ్చి ఐరిష్-అమెరికన్ గా, ఇటలీ దేశం నుండి ప్రవాసం వచ్చి ఇటాలియన్-అమెరికన్ గా, ఒక నల్లజాతీయుడు బ్లాక్-అమెరికన్ గా, మెక్సికో, దక్షిణ అమెరికా నుంచి ప్రవాసం వచ్చి మెక్సిన్-అమెరికన్ గా వారి వారి ఉనికిని అనేక రకాలుగా ధైర్యంగా,గర్వంగా తెలియ జేస్తారు.అలాగే భారతీయ-అమెరికన్లు కూడా ఉండవచ్చు. ఇలాగే అమెరికాలో ప్రజలకు యూదులమని, ముస్లింలమని, క్రిస్టియన్లమని వారి వారి విలక్షణతను గురించి మంచి అవగాహన కలిగి ఉంటారు.మరి ఎందుకు ఇలా మనదైన ఆహిందూ విలక్షణతను వది లేసి, దక్షిణాసియులు అనేముసుగు వెనక నిలబడాలి అనే విషయం అర్థం కాదు.

దక్షిణాసియులు అనబడే గుంపుల్లో చూస్తే కనుక, 90 నుంచి100శాతం వరకూ భారతీయులే అందులో హిందువులే ఉంటారు.మేము ఇక్కడో హిందూ-యూదుల సంఘం ఆరంభించాము.అందులో కొంత మంది యుూదులు చేరతామన్నారు. మేము సరేనన్నాము. ఇక్కడ ఆసక్తికరంగా వారికి వాళ్ళ ధర్మం గురించి మంచి అవగాహన ఉండడం వల్ల ఈ హిందూ అనే పేరుతో మాకేం అభ్యంతరం లేదన్నారు. నేను, నా కో-ఫౌండరు హిందు-యూదు ల సంఘం అనే పేరు నిశ్చయించాము.కాని చాలామంది హిందువులు అలాకాకుండా దక్షిణాసీయుల సంఘంగా ఎందుకుంచకూడదూ అని అన్నారు.

అదోభయం.ఒక ఇన్ఫిర్యారిటీ కాంప్లెక్స్ లాంటిది.నా దృష్టిలో కొంచం ఆత్మగౌరవం లేకపోవడం అయితే మరి కొంత అవగాహన లోపం; పరిశీలనలేమి; పరిశోధనా లేమి మరి కొంత కారణం.ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా జనం రారు.ఇలాంటి చర్చల్లో పాల్గొనరు.ఎప్పుడైనా ఎక్కడైనాపాల్గొన్నా…..ఏదో ఓ 5మిలియన్ల డాలర్లకు చెక్కు రాసిచ్చేసి తమ పేరు ఒక్కడో ఓ మూలన రాయించేసుకుంటేసరి. అంతకంటేమరీ ఎక్కువగా కలుగ చేసుకో డానికి ఇష్టపడరు. అసలు ఎక్కువగా తెలుసు కోవాలని కూడా అనుకోరు.

ఇలాంటివి చాలా సార్లు చూసాను.అంతా పేరు ప్రతిష్టలకే.ఇంకా చెప్పాలంటే, వాళ్ళ పిల్లాడు ఏ హార్వడ్ లో చేరితే అదే ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఏదో సంస్థలో బోర్డులో స్థానం దొరుకుతుంది. వ్యాపారానికి మంచిది. అని ఇలా వాళ్ళ సహకారం అంత నిజాయతీ పరంగా ఉండదు..ఉద్యమం కోసం మాత్రమే అనే నమ్మకం, నిజాయతీ కనపడదు.ఇక ఈ హిందూ ధర్మ సంస్థలలో ఉన్నచాలామంది వారి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం అవకాశాలు చూస్తూ ఉంటారు.ఏ జాతీయ స్థానంలోనో అధిపత్యం దొరికితే బాగుండును అని ఆశిస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ఉద్యమకారణం కోసం ధైర్యంగా పోరాడుతున్నారు.

గత పదేళ్ళలో మాత్రం] మార్పు వస్తోంది. ఇప్పుడు ఇంకా చాలా మంది ఇలాంటి హిందూ ఫోబియాని ఎదుర్కోడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాము కూడా… వార్తా పత్రికలలో, టీవిలో, సమాజంలో, పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు….ఇలాంటి వ్యతిరేకపు పక్షపాతాన్ని ఎదురుకుంటున్నారు.మన వాళ్ళలో ధనం, సమాజిక స్థానం తో పాటు ధైర్యం కూడా పెరగడం చూస్తున్నాను.అంటే విద్యాపరంగా, వృత్తిపరంగా ఇక్కడ ఇంతగా రాణిస్తున్నప్పుడు నా సాంప్రదాయాన్నిఇలా అవమానం చేయడానికి వీళ్ళెవరు అని ప్రశ్నిస్తునారు. చూస్తున్నాము అలాంటి మార్పుని ఈ మధ్య..

Leave a Reply