శబరిమలలో ఉన్న అయ్యప్ప మందిరము కేరళలోని పడమటి కనుమల పర్వతశ్రేణులలో ఉన్న పెరియార్ టైగర్ రిజర్వులో ఉన్నది. ప్రతి సంవత్సరమూ పది కోట్లకు పైగా భక్తుల రాకతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తీర్థ క్షేత్రములలో ఒకటి.
క్రీస్తుపూర్వం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే పరశురామ భగవానులు ఈ విగ్రహమును ప్రతిష్ఠించినారు. దీని స్థలపురాణమైతే ఇట్లున్నది. శిశువుగా ఉన్న అయ్యప్ప స్వామిని పందళం మహారాజు దత్తత తీసుకున్నారు. యువావస్థలోనే మహిషి అను రాక్షసిని సంహరించి వారు తమ అవతార ప్రయోజనమును పూర్తిచేసుకున్నారు. అటుపిమ్మట వారు శబరిమలను తమ నివాసముగా స్వీకరించి అచటనే బ్రహ్మచారిగా తపస్సు చేసినారు.
భక్తుల శబరిమల యాత్రలో ప్రత్యేకత యేమనగా వారు సాంసారిక భోగములను అన్నింటినీ విడిచిపెట్టి 41 దినముల కఠోర వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాచరణము వల్ల భక్తులు పరిశ్రమతో కూడిన ఒక సుదీర్ఘ పాదయాత్ర తరువాత ఆ స్వామి రూపముతో తాదాత్మ్యము చెందుటకు యోగ్యులగుదురు. అతి పవిత్రమగు 18 మెట్లైతే వ్రతాచరణముచే శుద్ధమైన అంతఃకరణము కలిగిన భక్తులే అధిరోహించగలరు. ప్రతియొక్క మెట్తు మందిర ద్వారము పై లిఖింపబడిన “తత్త్వమసి” అను మహావాక్యముచే సూచింపబడే జీవబ్రహ్మైక్యము వైపుకు ఒక సోపానము.
శబరిమలలో అన్ని మతముల వారికి, అన్ని వర్గముల వారికి, అన్ని కులముల వారికి, ఎటువంటి భెదభావములకు తావులేక ప్రవేశము గలదు. శబరిమలకు వచ్చే ప్రతీ భక్తుణ్ణి కుడా “స్వామీ” అనో లేక “అయ్యప్పా” అనో సంబోధిస్తారు. గురుస్వామి ఐతే సమాజములోని అట్టడుగు స్థాయివారు కూడా కావచ్చు. వారి వద్ద వ్రతదీక్షను పొందే శిష్యస్వాములు అత్యున్నత స్థాయివారు కూడా కావచ్చు.
మందిరములో స్త్రీప్రవేశము విషయంలో ఎటువంటి నిషేధమూ లేదు. కేవలము ఆయువు ఆధరంగా కొన్ని నియమములు ఉన్నవి. పిల్లలను కనగలిగే 10 నుండి 50 వరకు యేళ్ళ మహిళలు అయ్యప్ప స్వామియొక్క నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతాచరణ సంకల్పమును గౌరవిస్తు ఈ మందిరమును దర్శించ కోరరు. ఇచటి మూర్తి ఒక బ్రహ్మచారి మరియు యోగి యొక్క మూర్తి.
అత్యున్నత న్యాయస్థానము వారు మహిళలందరికీ ఈ మందిరములోనికి ప్రవేశము గలదని ఆదేశించినారు. ఐదుగురు న్యాయాధిపతులలో నలుగురు ఈ మందిరము యొక్క నియమములు మహిళల సమానత్వ హక్కులను మరియూ ఆరాధన సంబంధిత హక్కులను ఉల్లంఘిస్తున్నాయని నిర్ధారించినారు. ఇట్లు నిర్ధారించుటచే అత్యున్నత న్యాయస్థానము వారు మందిరము యొక్క పరంపరను మరియూ భక్తుల నమ్మకాలను, వేటి కొరకైతే ఈ మందిరము అసలు ఉన్నదో, వాటిన్ననింటినీ నిరాకరించినారు. ఆ ఐదుగురిలో ఏకైక మహిళా న్యాయాధిపతి ఇందూ మల్హోత్రా ఐతే మిగితా నలుగురు న్యాయమూర్తుల ఆదేశమునకు భిన్నముగా తమ ఆదేశమును ప్రకటించినారు.
ఈ వ్యాజ్యము 2006 లో ఇండియన్ యంగ్ లాయర్స్ అస్సొసియేషన్ వారు చేసుకున్న మనవిపై ఆధారపడియున్నది. వీరి వాదన యేమంటే పూర్వము ప్రధాన న్యాయస్థానము వారు ఆయువు ప్రధానమైన నియమములను సమర్థించగా అది భారత రాజ్యాంగం నిబంధన 25 లోని స్వమత పరిపాలనా మరియూ ప్రచారములను ఉల్లంఘిస్తున్నదీ అని. కానీ ఈ వాదులలో యెవ్వరూ కూడా అయ్యప్ప భక్తులైతే కారు. వారెవ్వరూ కెరళ నుండి వచ్చినవారు కూడా కారు. వారు కెవలమూ ఈ మందిరము యొక్క పవిత్రతను మరియూ ఆచారములను ధ్వంసం చేయుటకొరకే పూనుకున్నవారు.
వారు ఈ వ్యాజ్యాన్ని లైంగిక సమానతా పరముగా ప్రస్తుతించారు. ప్రచార మాధ్యమములవారైతే దీనిని ఋతుస్రావ పరముగా తప్పుగా ప్రస్తుతించారు. అత్యున్నత న్యాయస్థానము వారి ఈ నిర్ణయము న్యాయస్థానము వారు తమ పరిమితిని మీరి ప్రవర్తించుటకు ఒక ఉదాహరణము. అప్పట్లో సేవానివృత్తులు కాబోయే ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ విషయమును సమగ్రముగా పరిశీలించక కేవలమూ ప్రజలు చలించునట్లు మరియూ పత్రికలలో ముఖ్యసమాచారంగా శీర్షిక అయ్యేట్లుగా ప్రవర్తించినారు.
న్యాయస్థానము వారు ప్రతీ హైందవ మందిరము తమదైన విశిష్టమైన ఆచారాలను కలిగి ఉంటుందని, అంతటా ఒకే ఆచారం ఉండబోదనియు మరియూ మందిరములు బహిరంగ ప్రదేశములు కావనే విషయాలను పట్టించుకోకుండా ప్రవర్తించినారు. భక్తులనో లేక నిపుణులనో వారు సంప్రదించనే లేదు. ఆ తరువాత కేరళ లోని వామపక్ష దళాల ప్రభుత్వం ఆ ఆదేశాన్ని బలవంతముగా అమలుచేసినది. ఇటువంటి వేరే కొన్ని ఆదేశాలనైతే అమలుచేయుటలో కేరళ ప్రభుత్వం మక్కువ చూపలేదు.
శబరిమల ఇప్పుడొక యుద్ధభూమిగా మారినది. ప్రభుత్వమూ మరియూ పోలీసు యంత్రాంగమూ కలిసి స్త్రీవాద శక్తులచే చేసిన మందిర ప్రవేశమూ మరియూ దైవమును అవహేళణ పరచటం వంటి రెచ్చగొట్టే పనులను ప్రొత్సహించినారు. భక్తులైతే శాంతిపూర్వకముగా అయ్యప్ప స్వామి నామమును ఉచ్చరించుచూ, స్త్రీవాద కార్యకర్తలను తమ పరంపరాగత ఆచారాలను కాపాడుకొనుటకై వేడుకొన్నారు.
పోలీసులైతే భక్తులతో అతి కఠినముగా ప్రవర్తించినారు. విశ్రాంతి గృహములనూ మరియూ త్రాగు నీటి సదుపాయములను అన్నింటినీ కూడా మూసివేసి భక్తులకు ప్రాతఃకాల దర్శనము కొరకు వేచి యుండే అవకాశము కూడా ఇవ్వకుండెను. వృద్ధులనూ పిల్లలనూ కూడా అశుభ్రమైన ప్రదేశములలో, యెక్కడైతే మురికి కూడి యుంటుండో మరియూ పందులు సంచరిస్తూ ఉంటాయో, అటువంటి ప్రదేశములలో నిలిపి యుంచారు. అటు పిమ్మట పోలీసులు భారీ సంఖ్యలలో భక్తులను నిర్బంధించి ఇంచుమించు 6000 మంది భక్తులను అరెస్టు చేసారు.
కేరళ రాష్ట్ర ప్రభుత్వమూ మరియూ పోలీసు యంత్రాంగమూ కూడా మానవాధికారములను తీవ్రముగా ఉల్లంఘించినాయీ. లక్షల కొలది భక్తులు విశేషించి యువ మహిళలు కూడి తమ చేతులను హారముగా కలిపి 700 ల కిలోమీటర్ల అయ్యప్ప జ్యొతిగా పరంపరాగత ఆచారాల పట్ల తమ సహానుభూతిని వ్యక్తపరచారు. ఇటువంటి కార్యక్రమాలను ఉద్దేశపూర్వకముగా సమాచార మాధ్యమాల వారు తమ మాధ్యామాల ద్వారా తెలుపలేదు. ప్రభుత్వమైతే వీటిని పట్టించుకోలేదు.
అమెరికాలో “సేవ్ శబరిమల, యూ.ఏస్.ఏ” అన్న పేరిట ప్రచారం 50 కి పైగా హైందవ సంస్థలు కూడి జరిపినవి. అరెస్టు చేయబడ్డవారికి మరియూ వారి కుటుంబ సభ్యులకునూ కూడా చట్టపరమైన సహాయతను అందించడానికై వారిచే విరాళములు అందింపబడ్డయీ.
వామపక్ష ప్రభుత్వముచే ప్రొత్సహింపబడిన క్రైస్తవ మతమర్పిడి శక్తులకు శబరిమల పరిసరాలలో యెన్నో భూ సంబంధితమైన లావాదేవీలు గలవు. వారి ఆశయమేమనగా అచట ఒక విమానాశ్రయమును కట్టి శబరిమలను ఒక పర్యటనా స్థలముగా మార్చుటయే. దీనిని వారు లైంగిక భేదభావములనే ముసుగునుండి సాధింప చూచుచున్నారు.
కేరళ లోని మందిరములను అణిచివేయ కోరే రాష్ట్ర ప్రభుత్వము యొక్క మరియూ దెవస్ఠానము బోర్డు యొక్క నియంత్రణ నుండి విడిపించాలి. వారు కేవలమూ హిందువుల ఆలయాల వ్యవహారాలలోనే జోక్యం చేసుకోవటం అనేది పక్షపాతం తో కూడిన వ్యవహారము. ఏల యనగా అట్టి నియంత్రణ చర్చులకూ మసీదులకును కూడా వర్తించదు.
భారత దేశమును చీల్చివేయ కోరే శక్తులు ఇంతకింతా వ్యాపించిపోతున్నాయీ. వారు సక్రియముగా హిందువుల ఆచార వ్యవహారాలను నష్టం చేయాలని చూస్తున్నారు. శబరిమల వారి ప్రస్తుత లక్ష్యము. దీని తరువాత ఏ మందిరమును లేదా యెటువంటి ఆచారములను లక్ష్యం చెస్తారో ఎవరిచే కూడా చెప్ప శక్యము కాదు. భారీ నిధులతో కూడిన పద్మనాభ స్వామివారి మందిరమే వీరి తరువాతి అక్ష్యమా? ఐననూ కావచ్చును. వీరి తరువాతి లక్ష్యమేమో ఎవరిచే కూడా చెప్ప శక్యము కాదు.